![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241218-wa07735885690649829114438.jpg?resize=696%2C303&ssl=1)
![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241218-wa07725186369033467146556.jpg?resize=696%2C453&ssl=1)
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా లో ముగ్గురు ప్రధాన స్మగ్లర్లు అరెస్ట్
*గుజరాత్ రాష్ట్రం, పఠాన్ లోని ఎర్రచందనం గోడౌన్ పై ఆకస్మిక దాడులు జరిపిన ఎర్రచందనం పోలీసులు
* సుమారు రూ.3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.
*జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు
దినమలర్ న్యూస్:
తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్సు సిబ్బంది అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా, వారి ద్వారా గుజరాత్ పట్టణంలో ఎర్రచందనం దాచి పెట్టిన గోడౌన్ గురించి సమాచారం తెలిసింది.
ఈ సమాచారం మేరకు తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ టీమ్ ను గుజరాత్ రాష్ట్రానికి పంపడం జరిగింది.
స్థానిక పోలీసుల సహాయంతో గుజరాత్ లోని దీసా పట్టణానికి చెందిన ఉత్తమ్ కుమార్ నందకిషోర్ సోని అతని స్నేహితులు జోషి హన్స్ రాజ్ విర్జాయ్, పటాన్ పట్టణానికి చెందిన పరేష్ జీ కాంతిజీ ఠాకూర్ లను అరెస్టు చేయడం జరిగింది.
ముద్దాయిలు నిర్వహిస్తున్న గోడౌన్ లోని 155 ఎర్రచందనం దుంగలను ( 4952 కేజీలు ), ఒక మారుతీ బ్రీజా కారును స్వాధీనం చేసుకుని, వారిని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్ వారెంట్ పై తిరుపతికి తరలించారు.
ఇందులోని ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు మూడన్నర కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఈ అంతర్రాష్ట్ర ముద్దాయిలపై దర్యాప్తు చేస్తున్నాము. అవసరమైతే వీరిపై పీ.డీ యాక్టు ప్రయోగించి, ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తాం.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన తిరుపతి టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ శ్రీనివాస్ వారిని, డీఎస్పీలు జి.బాలిరెడ్డి, వి.శ్రీనివాస రెడ్డి, ఎండీ షరీఫ్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు.