


పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం
*ఉత్తరాంద్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు వేసి ఉపాధ్యాయ నాయకుడిని శాసన మండలికి పంపాలని ఉపాధ్యాయులు,ఉద్యోగులను కోరిన పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ*
గత ఐదేళ్ల పాలనలో శాసన సభ్యులకు కూడా చట్ట సభలలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసన మండలిలో అనుభవజ్ఞ్యులైన పాకాలపాటి రఘువర్మ గారికి మరొక్కసారి అవకాశం కల్పిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుక అవుతారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధిని చూసి రఘువర్మ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని పేరు పేరునా ఉపాధ్యాయులను కోరారు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ