HomeUncategorizedఉప్పల్ భాగాయత్ లో రేపు ( 22 న ) విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం హైదరాబాద్,...
ఉప్పల్ భాగాయత్ లో రేపు ( 22 న ) విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం హైదరాబాద్, సెప్టెంబర్ 21 : శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఉప్పల్ భగాయత్ లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ప్రాంగణంలో ఆదివారం, 22 వ తేదీన, నిర్వహిస్తున్నట్టు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ తెలిపింది. 22 న ఉదయం 7 గంటలకు గణపతి పూజ, అఖండ ప్రతిష్ట, కలశ స్థాపనతో ఈ యజ్ఞం ప్రారంబమవుతుందని తెలిపారు. అనంతరం ధ్వజారోహణం, విశ్వకర్మ భగవానుడికి అభిషేకం, పల్లకి సేవ ఉంటుంది. ఈ సందర్బంగా విశ్వకర్మ కళాకారులచే రూపొందిన హస్తకళా ప్రదర్శన ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని మహోత్సవ కమిటీ తెలిపింది. ఈ యజ్ఞానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి, కేంద్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు ఆచారి, రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, దాసోజు శ్రవణ్, ఉపేంద్ర చారి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణఆత్మగౌరవ భవనం చైర్మన్ లాలుకోట వెంకటా చారి, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్ తదితర ప్రముఖులందరూ పాల్గొంటారని విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ తెలియచేసింది. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ సమాజం పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.