అభినందించిన వి సి దాన కిషోర్.
*ఉస్మానియా కు ఐఐటి బాంబే
బెస్ట్ యూనివర్సిటీ అవార్డు*
– అభినందించిన విసి దాన కిషోర్
హైదరాబాద్ సెప్టెంబర్25( సమయం న్యూస్బ్
IIT బాంబే FOSSEE GIS (NMEICT) కార్యక్రమాలపై అవగాహన కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు గానూ
ఐఐటి బాంబే ఇటీవలే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని “ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు” ను అందజేసింది.
అలాగే ఓయూలోని జియోగ్రఫీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ అక్తర్ అలీకి నేషనల్ జియోస్పేషియల్ ఫ్యాకల్టీ ఫెలో అవార్డు కూడా లభించింది.
ఈ సందర్భంగా బుధవారం జియోగ్రఫీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ అక్తర్ అలీ , విద్యార్థులు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దాన కిషోర్ ను సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో కలిశారు. అవార్డు వివరాలను తెలియజేశారు. మేమెంట్ లను పరిశీలించిన వైస్ ఛాన్సలర్…. ఉస్మానియా విశ్వవిద్యాలయం కు అవార్డు లు రావడం గర్వించదగిన విషయం అన్నారు.
DTCP ( Directorate of Town and Country Planning) డైరెక్టర్ ను జియోగ్రఫీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, విద్యార్థులుకలిసి
GPS సర్వే లో పాలు పంచుకోవాలన్నారు.