Thursday, December 26, 2024
HomeUncategorizedఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం

ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం



*3 గుళ్లు కట్టించి, గడపకో వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థి*

*వరంగల్*

రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ఎన్ని కలు ఏకగ్రీవమయ్యాయి. మూడు గుళ్లు కట్టించి, గడపకో రూ.వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్య ర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్సిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరు పుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మతల్లి, ఆంజనేయుడికి మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు రూ.1000 చొప్పున పంచుతానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.

ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్ని కల్లో ఎవరూ పోటీచేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రా మస్తులు..సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని

పెద్ద మనుషులతో రాసుకున్న అగ్రిమెంట్ పేపర్.

మాటతప్పి వేరేవాళ్లు నామినేషన్ వేస్తే.. రూ.50 లక్షల జరిమానా.

గ్రామస్తుల సమక్షంలో ఒప్పంద పత్రం..విజయోత్సవ వేడుకలు.

వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండాలో ఘటన.ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పను లన్నీ పూర్తిచేస్తానని దరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో సోమవారం ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకొని. సర్పంచ్ అభ్యర్థి, గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే.. కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నా రు. ఒప్పందపత్రంపై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని, వేడుకలు చేసుకున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments