Thursday, December 26, 2024
HomeUncategorizedఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధికి విడుదల చేసిన కూడా చైర్మన్

ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధికి విడుదల చేసిన కూడా చైర్మన్

*హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి 1.53 కోట్లు విడుదల చేసిన కూడా( కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)*
హైదరాబాద్ సెప్టెంబర్25,( సమయం న్యూస్,)


ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పరిపాలన అనుమతుల పత్రాన్ని సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అందించిన కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి..

ఎల్కతుర్తి జంక్షన్ వయ వరంగల్, మరియు సిద్దిపేట రహదారి కరీంనగర్ ని అనుసంధానం చేయడంలో ప్రధానమైనదని, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. 

అదే విధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఎల్కాతుర్తి జంక్షన్ ని నాలుగులైన్ రహదారిగా మార్చడంకోసం పనులు ప్రారంభించారు. 

మంత్రి గారూ పేర్కొన్న ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్మెంట్ మరియు బ్యూటిఫికేషన్ కోసం, హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ సదరు రహదారిని సెప్టెంబర్ 12 నాడు సందర్శించి, ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ని పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశించడం జరిగింది.

సదరు ప్రాథమిక అంచనాల ఆధారంగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు సమర్పించిన రూ 1.53 కోట్లు  “ఎల్కతుర్తి ట్రాఫిక్ జంక్షన్ అభివృద్ధి” కోసం విడుదల చేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments