Ji
*హైదరాబాద్, సెప్టెంబర్ 11:* (సమయం న్యూస్) ఎల్బీ నగర్ జోన్ లో H-CITI క్రింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట బుధవారం ప్రాజెక్ట్ సి.ఈ, ఎస్.ఈ, ఇతర ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ అల్కాపురి జంక్షన్, ఫ్లైఓవర్ ప్రతిపాదన, టి.కె.ఆర్ జంక్షన్ నుండి గాయత్రి నగర్, మంద మల్లమ్మ జంక్షన్ వరకు చేపట్టనున్న ఫ్లైఓవర్ ప్రతిపాదనలను కమిషనర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఆవశ్యకత ను ప్రాజెక్ట్ సి.ఈ దేవానంద్ కమిషనర్ కు వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఫ్లైఓవర్ అలైన్మెంట్ కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తదనంతరం ఎల్‌బి నగర్ జంక్షన్‌ను పరిశీలించి, ఫ్రీ లెఫ్ట్ కు అవసరమైన భూసేకరణ కొరకు నిర్వహించడానికి టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌లను ఆదేశించారు. బైరామల్‌గూడ RHS లూప్‌ను పరిశీలించి, సెపరేట్ గ్రేడ్ రోడ్ వర్క్ నుండి బైరామల్ గూడ RHS లూప్ పూర్తి కావడానికి ఆస్తుల సేకరణ వేగవంతంగా పూర్తి చేయుటకు టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయ తో తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ప్రాజెక్ట్ సి.ఈ దేవానంద్, ఎస్.ఈ, ఈ ఈ రోహిణి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.