Tuesday, January 21, 2025
HomeUncategorized*కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..*

*కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..*

*కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..*

దిల్లీ: మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని సీజేఐ ధర్మాసనం చెప్పింది..

*కేటీఆర్‌కు ఏసీబీ సూటి ప్రశ్నలు ఇవేనా..?*

హైదరాబాద్: ఆర్వింద్ కుమార్‌ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు..

స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది.. వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది.. పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందం లోకి లాగారు.. హెచ్ఎండీఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు.. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయ కూడదనే విషయం తెలియదా.. అనే కోణంలో కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం..

ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీలో ఒప్పందం ఎలా చేసుకున్నారు.. నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఎందుకు నివారించ లేకపోయారు.. అన్న విషయాలపై అర్వింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ కేటీఆర్‌ను ప్రశ్నించడానికి సిద్ధమైనట్లు సమాచారం..

కాగా, కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు నాలుగు గంటలకు పైగానే విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కేటీఆర్‌ను విచారణ జరిపి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు.

మరోవైపు, న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంటే, కేటీఆర్ విచారణ గదిలో ఉంటే.. ఆయన తరఫు న్యాయవాది లైబ్రరీలో కూర్చునే విధంగా ఏసీబీ అధికారులు ఏర్పాటు చేశారు. కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాది ఉండాలనే అంశాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మరోవైపు.. నిన్న (బుధవారం) అర్వింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ జరిపిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఇందులో ఫిర్యాదు దారుడిగా ఉన్న దాన కిషోర్ స్టేట్‌మెంట్.. ఈ రెండు స్టేట్‌మెంట్‌ లను ఆధారంగా చేసుకుని అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.. ఈ ఫార్ములా కారు రేసులో దాదాపు రూ. 55 కోట్లు విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు బదిలీ జరిగిందో వాటి పైనే ఎక్కువగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం..

మరోవైపు, ఈ రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి జమ చేసే సమయంలో నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారు. ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా నగదు బదిలీ చేయడం.. అలాగే ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం, ఆర్థిక శాఖకు సమాచారం ఇవ్వకుండా హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇదంతా కేవలం కేటీఆర్ ఆదేశాల తోనే జరిగిందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌‌ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు.

ఈ నెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడ్డారు.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు… కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టి వేసింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీం కోర్టు సీజేఐ నిరాకరించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments