” *క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ మేయర్.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గటీ టీ యు సి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి తో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకలను పురస్కరించుకొని తార్నాక, లాలపెట లో గల లోగోస్ గాస్పల్ చర్చ్‌లో జి హెచ్ ఎం సి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్ క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులందరికీ “మేరీ క్రిస్మస్” శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకలలో డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని, మనుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఈ వేడుకలను అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అందరూ ఉత్సాహంగా జరుపు కొనేందుకు జి హెచ్ ఎం సి పతిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ సమాజానికి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రిస్టియన్ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం, పండుగల సందర్భంగా ప్రత్యేక నిధులు విడుదల చేయడం, పేద క్రిస్టియన్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు గెటర్ వ్యాప్తంగా 190 ప్రదేశాల్లో వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ మేయర్ వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ క్రిస్టియన్ సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉందని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు