HomeUncategorized. రాష్ట్రం లో గణేష్ నిమజ్జనం ప్రశాంతం: డిజిపి డాక్టర్ జితేందర్ ఐపీఎస్. తెలంగాణ రాష్ట్రంలో...
. రాష్ట్రం లో గణేష్ నిమజ్జనం ప్రశాంతం: డిజిపి డాక్టర్ జితేందర్ ఐపీఎస్.
తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ తెలిపారు. డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డి జి కంట్రోల్ సెంటర్లో మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి సన్నాహక చర్యలో భాగంగా గత కొంత కాలం నుండి సమన్వయ సమావేశాలను నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ .రేవంత్ రెడ్డి , హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ లు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అన్ని శాఖల అధికారులతో చర్చించారన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని డీజీపీ అన్నారు. రాష్ట్రంలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం పూర్తయిందని, బుధవారం నాడు పని దినం అయినందున సాధ్యమైనంత త్వరగా నిమజ్జనానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ తో సమన్వయం చేసుకొని గతంలో తీసుకున్న ప్రణాళిక ప్రకారం రూట్ మ్యాప్ కు అనుగుణంగా నిమజ్జనం జరుగుతుందన్నారు. ప్రజలందరూ భక్తి, శ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా నిమజ్జనం జరిగేలా వ్యవహరించాలని డిజిపి కోరారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ శ్రీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్ -1 ఐ జి పి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.