*గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం: కమిషనర్ ఆమ్రాపాలి కాట*
*హైదరాబాద్, సెప్టెంబర్ 16:* ( సమయం న్యూస్) గణేష్ నిమజ్జనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు.
సోమవారం నెక్లెస్ రోడ్డులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి శానిటేషన్, ఇంజనీరింగ్, యుబిడి, యుసిడీ విభాగాలను చెందిన సిబ్బందితో కలిపి మొత్తం 15 వేల మంది మూడు షిఫ్ట్ లలో 24 గంటల పాటు భక్తులకు సేవలందిస్తారని తెలిపారు.
గణేష్ నవరాత్రుల కోసం నెల రోజుల నుండి పలు దఫాలుగా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో, ఇతర శాఖల సమన్వయ సమావేశాలతో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
నగర్ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్ రూమ్ లు, కమాండ్ కంట్రోల్ రూంలో అడిషనల్ కమీషనర్ స్థాయి అధికారులతో మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్, పెద్ద చెరువులలో నిమజ్జన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 468 క్రేన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినాయకులను నిమజ్జనంకు తీసుకు వచ్చేటప్పుడు కలర్ పేపర్లు వెద జల్లడం వలన, వాటిని శుభ్రం చేయడానికి శానిటేషన్ సిబ్బందికి ఇబ్బంది తలెత్తుతున్నందున భక్తులు అలాంటి కలర్ పేపర్లు రోడ్డు పై వెదజల్లకుండ శానిటేషన్ సిబ్బందికి సహకరించాలి అన్నారు. డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్, విద్యుత్, యుబిడీ, స్థానిక పోలీస్, ఉత్సవ కమిటీ సభ్యులతో కమిటీ లు వేసి ఊరేగింపునకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే గుర్తించి రోడ్డులలో మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డురాకుండా చెట్టు కొమ్మలు నరికి వేయడం, డార్కు స్పాట్స్ లేకుండా వెంటనే చర్యలు తీసుకున్నట్లు, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే నేడు గ్యాప్స్ పూరించేందుకు చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని భక్తులను కోరారు.
————————————————————-
*- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారిచేయడమైనది.*