Tuesday, December 10, 2024
HomeUncategorizedగ్రేటర్ లో ఆసంపూర్తిగా ఉన్న ఫ్లై ఓవర్లు, నాళాల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి.హైదరాబాద్...

గ్రేటర్ లో ఆసంపూర్తిగా ఉన్న ఫ్లై ఓవర్లు, నాళాల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి.హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.

*జీహెచ్ఎంసీ లో పెండింగ్ లో ఉన్న నాలలు ,ఫ్లై ఓవర్ ల నిర్మాణం వేగవంతం చేయాలి..*

*ఎక్కడెక్కడ కొత్త నాళాలు ,ఫ్లై ఓవర్లు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలి..*

*90 రోజుల వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రాంలో భాగంగా పెద్ద పెద్ద బిల్డింగ్ లు ,అపార్ట్మెంట్ లలో ఇంకుడు గుంతల పై అవగాహన కల్పించాలి..*

*141 లాగింగ్ పాయింట్స్ లో ప్రధానంగా ఇబ్బందులు  ఉన్న 23 సంపులలో పనులు వేగవంతం చేయాలి*

*వచ్చే వర్షాకాలం లోపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండకుండా చర్యలు తీసుకోవాలి*

*హైదరాబాద్ లో జరుగుతున్న వివిధ డిపార్ట్మెంట్ లలో జరుగుతున్న పనుల్లో అధికారులు సమన్వయం చేసుకోవాలి జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*

హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో  జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపి, ఎస్ఎన్డీపీ లో ప్రాజెక్ట్ భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు , నాళాల నిర్మాణాలు పై జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్లు ,ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


హైదరాబాద్ లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నుండి ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి  నగరంలో ఎస్ఆర్డీపి లో భాగంగా 48 ఫ్లే ఓవర్ లను ప్రారంభించింది.
ఈ ఫ్లై ల ఓవర్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్ అవైడ్ చేయడానికి , సమయాన్ని , ఫ్యుయల్ ను అదా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్ఆర్డిపి వర్క్స్ లో భాగంగా  జీహెచ్ఎంసీ కి  సంబంధించి 42 వర్క్ కాగా 6 ఫ్లై ఓవర్ లు ఆర్ అండ్ బి ,హెచ్ఎండీఏ కి చెందినవి అందులో ఇప్పటికే 36 పనులు పూర్తయ్యాయని చీఫ్ ఇంజనీర్ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ హెచ్ లో భాగంగా నిర్మిస్తున్న అంబర్ పేట ఫ్లై ఓవర్,ఉప్పల్ – నారపల్లి నిర్మాణం కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పెండింగ్ లో ఉన్న ఫ్లై ఓవర్ నిర్మాణాలు వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అరంఘర్ వయ శాస్ట్రిపురం మధ్య నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు చివరి దశలో ఉండడంతో డిసెంబర్ లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఎస్ఎన్డీపీ లో భాగంగా నగరంలో నాళాల ద్వారా మురుగు నీటి వ్యవస్థ తదితర అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చించారు.పెండింగ్ లో ఉన్న నాళాల పై ఆరా తీశారు. వచ్చే వర్షాకాలం సీజన్ లోపు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త ఫ్లై ఓవర్ లు ,కొత్త నాళాలు అవసరమైన చోట ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

జీహెచ్ ఎంసీ లో మాత్రమే కాకుండా పరిసర ప్రాంత మున్సిపాలిటీ లలో బడంగ్ పెట్ , జల్పల్లి,మీర్పేట్ తదితర కోర్డినేట్ చేసుకొని పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. రైల్వే డిపార్ట్మెంట్ కడుతున్న అండర్ పాస్ లు తదితర పనులు csdpl 11kv /33kv పనులపై విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సీఆర్ఎంపి రోడ్ల లో భాగంగా జీబ్రా క్రాసింగ్ లైన్ సైనెడ్ బోర్డులు ఇతర రోడ్డు మార్కింగ్ లు ఎక్కడైనా పెండింగ్ పనులు ఉంటే పూర్తి చెల్లించాలని కొత్త రోడ్లు అవసరం ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం నగరంలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 50 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ మొదటిదశ చేపట్టిన రైన్ వాటర్ హార్వెస్టింగ్ 18 ప్రాంతాల్లో 23 సంపులు పనులు ఎంత వరకు వచ్చాయి వాటి పురోగతి పై ఆరా తీశారు. కొన్ని నాళాల ద్వారా నీరు నేరుగా ముసిలోకి పోకుండా భూగర్భంలోకి ఇంకే విధంగా ప్రయత్నాలు చేయాలని దాని ద్వారా భవిష్యత్ లో వాటర్ సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఇప్పటికే 90 రోజుల వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రాంలో భాగంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేల ప్రజలకు అవగాహన కల్పించాలనీ సూచించారు. భావి తరాలకు నీటి వనరులు అందించే సామాజిక బాధ్యతను అందరూ పాటించాలన్నారు. నగరంలో ఎక్కడ పెండింగ్ పనులు ఉన్న వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

సమావేశంలో జీహెచ్ఎంసీ సీ సి పీ శ్రీనివాస్    srdp ప్రాజెక్ట్  చీఫ్ ఇంజనీర్ ఎం దేవానంద్ ,sndp చీఫ్ ఇంజనీర్ కోటేశ్వర రావు ,చీఫ్ ఇంజనీర్ మైంటనేన్స్ భాస్కర్ రెడ్డి ఆరు జోన్ల ఎస్ సి లు తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments