*స్టేషన్ ఘనపూర్*సెప్టెంబర్08,సమయం న్యూస్
*ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరిశీలించారు. బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు. ఎవరూ అదైర్య పడవద్దని బాధితులకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి విడతలోనే ఇల్లు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో అవసరమైన సిసి రోడ్లను సైతం త్వరలోనే మంజూరు చేపిస్తానని అన్నారు. అంతకు ముందు జఫర్గడ్ మండలం తీగారం గ్రామానికి చెందిన ఉద్దమారి ప్రభాకర్ గుండె పోటుతో మరణించడంతో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.