Friday, December 27, 2024
HomeUncategorizedచాకలి ఐలమ్మ ఘన నివాళి

చాకలి ఐలమ్మ ఘన నివాళి

* తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన నిప్పురవ్వ చాకలి ఐలమ్మ… 
  టీజీ- ఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి.



    సంగారెడ్డి సెప్టెంబర్10సమయం న్యూస్,,   నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన నిప్పురవ్వ చాకలి ఐలమ్మ అని టి జి ఐ సి చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా  మంగళవారం  సంగారెడ్డి పట్టణంలో ఉన్న  వీరనారి  చాకలి ఐలమ్మ విగ్రహానికి టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి,  స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ చంద్రశేఖర్ లు   పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిది అన్నారు. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడపడుచు దొరల దోపిడిని ఎదిరించి నిలిచిందన్నారు.  వెట్టి చాకిరీ చేయొద్దని పిలుపునిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు.


     దున్నేవాడిదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చురుకుగా పాల్గొన్నారు. నిజాం పాలనలో వెట్టిచాకిరితో మగ్గిపోయిన అణగారిన వర్గాల బతుకులను బాగు చేయడానికి , పరిరక్షించడానికి తుపాకులు  పట్టి నిజాం కు , ఆనాటి దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆమె స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసం  ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు .  వీరనారి  చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని మహిళలు వారిపై జరుగుతున్న అన్యాయాలకు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్ , జిల్లా రజక సంఘం  అధ్యక్షులు నగేష్ , సభ్యులు , వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments