జర్నలిస్టులకు సిఎం రేవంత్ రెడ్డి షాక్
ఐదేండ్ల తర్వాతనే ఇండ్ల స్థలాలు
హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టులకు సిఎం రేవంత్ రెడ్డి షాకిచ్చారు. జర్నలిస్టులందరికీ రేపోమాపో ఇండ్ల స్థలాలు ఇస్తామని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి, జర్నలిస్టులకు హ్యాండిచ్చారు. ఇప్పట్లో ఇండ్ల స్థలాలు ఇవ్వమని, మళ్లీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మేము అధికారంలోకి రాగానే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలను క్లియర్ చేశాం. మొదటి విడత జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాం. మీకు సోషల్ రెస్పాన్స్ బులిటీ ఉండాలి. రెండో విడత కూడా ఇస్తాం. రెండో సారి అధికారంలోకి రాగానే అవి కూడా ఇస్తాం. జర్నలిస్టులకు నా విజ్ఞప్తి. మీరు కూడా తమ ప్రభుత్వానికి సహకరించాలని జర్నలిస్టులను రేవంత్ రెడ్డి కోరారు.