తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆహ్వానించారు.
ఆదివారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో, అదనపు ఈవో ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, వేదపండితులు గౌరవ ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.