Friday, December 27, 2024
HomeUncategorizedతెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉంది. బి అర్ యస్ అధినేత మాజీ...

తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉంది. బి అర్ యస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కే సి అర్.

నేడు ప్రజా కవి కాళోజీ  జయంతి

ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ( సెప్టెంబర్ 9) సందర్భంగా వారి సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.
ప్రజాపక్షం నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ,  అని కేసీఆర్ కొనియాడారు.
పుట్టుక…చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను  బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి  కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకొని సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నాం అన్నారు.

రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని,వరంగల్లో  కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 

కాళోజీ కవిత్వం,ఆలోచనలు అన్ని వేళలా ఆదర్శం అని కేసీఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments