Saturday, June 14, 2025
HomeUncategorized*తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్*...

*తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్*


తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్ ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.

కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోంది.

కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిన బుద్ధి రాలేదు.

ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.

కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు.

ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే?

అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమే.

ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారు.

అక్రమంగా దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలి.

9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదు. నిరంకుశ  పాలన సాగుతోంది.

Previous article
Next article
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments