అన్యాయంగా అరెస్టైన దళిత నాయకుడు మాజీ ఎంపీ నందిగం సురేశ్తో వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు సబ్ జైల్లో ములాఖత్ అయ్యారు. తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు వచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి అంబటి రాంబాబు విడదల రజిని ఉన్నారు. ఈ క్రమంలో జైలు వద్దకు కార్య కర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు తూ.గో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు.