*నగర సుందరీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట*
*హైదరాబాద్, నగర సుందరీకరణ లో భాగంగా జంక్షన్లు, ఫ్లైఓవర్లు, పార్కులు, వివిధ రకాల సుందరీకరణ పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన పచ్చదనం లో అంతర్జాతీయ గ్రీన్ సిటీగా అవార్డు ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ప్రజలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించేందుకు వినూత్న పద్ధతిలో పచ్చదనం పెంపొందించడంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఫారెస్ట్ విస్తీర్ణం పెరిగినట్లు గా జాతీయంగా గుర్తింపు లభించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సుందరీకరణ నగరంగా గ్రేటర్ హైదరాబాద్ ను తీర్చిదిద్దే క్రమంలో 6 జోన్ లకు మొత్తం 149 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంలో జిహెచ్ఎం సి కార్యరూపం దాల్చింది. ఇంతకు ముందు కూడా గ్రేటర్ లో పాదాచారులకు ప్రయోజనాలు కల్పించి ప్రమాద రహితంగా జంక్షన్ లను అభివృద్ధి చేశారు.. ఈ జంక్షన్ లలో పాదాచారుల భద్రత తో పాటుగా సుందరీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో కొన్ని సి.ఎస్.ఆర్ పద్ధతిలో చేపట్టుటకు ముందుకు రావడం జరిగింది. ఈ జంక్షన్ అభివృద్ధిలో పాదచారులకు ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న సందర్భంలో రోడ్డు దాటకుండా ఉండేందుకు కూర్చోవడానికి కుర్చీ లు ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ లేని సమయంలో పాదాచారులు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా రోడ్డు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ల వద్ద కళాత్మక చిత్రలేఖనాలు, ముఖ్యంగా భావి తరాలను ప్రభావితం చేసే విధంగ కళాత్మకంగా తీర్చి దిద్దారు.ఫ్లై ఓవర్ పిల్లర్స్ కొన్ని చోట్ల ఉద్యానవన పెయింట్స్ వెరైటీ థీమ్స్ తో కళాత్మక చిత్రాలు వేశారు. సెంట్రల్ మీడియం,జంక్షన్ లలో శిల్పాలు, ఆకర్షించే ప్రత్యేక థీమ్ లతో నగరాన్ని సుందరంగా ముస్తాబు చేయుటకు జిహెచ్ఎంసి ఫోకస్ పెట్టింది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా సౌందర్యంగా తీర్చిదిద్దే క్రమంలో ఆరు జోన్ల పరిధిలో 149.84 కోట్ల అంచనా వ్యయంతో 224 సుందరీకరణ పనులు చేపట్టగా అందులో రూ. 5.33 కోట్ల విలువ గల 15 పనులు పూర్తి కాగా మిగతా 209 పనులు వివిధ ప్రగతి దశలో కలవు. చిన్నారులకు, యువతకు స్ఫూర్తినిచ్చేలా సుందరీకరణ పనులు చేపట్టినట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు