. నాగర్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన రాష్ర్ట ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రోస్.
హైదరాబాద్ సెప్టెంబర్13 (సమయం న్యూస్)
శ్రీ రోనాల్డ్ రోస్, ఇంధన కార్యదర్శి మరియు సి ఎం డి టి జి జెన్కో టి జి ట్రాన్స్కో, శుక్రవార నాడు నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి విద్యుదుత్పత్తి స్థితిగతులను సమీక్షించారు.
మొత్తం 8 యూనిట్లలో 7 X 100MW యూనిట్లు మాత్రమే సర్వీసులో ఉన్నాయి. జనరేటర్ రోటర్ స్పైడర్ లోపం కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేని 2వ యూనిట్ ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
.