Sunday, December 8, 2024
HomeUncategorizedనిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లా

*గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్  ఆవిష్కరణ.*

వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు. మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు పోస్టర్‌ను శ్రీ  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ గారు (రెవెన్యూ) & అదనపు కలెక్టర్ శ్రీ అంకిత్ గారు (లోకల్ బాడిస్) మరియు శ్రీ మకారందు గారు (మున్సిపల్ కమిషనర్) పాల్గొన్నారు.     
పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు TGPCB  నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలొ బాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు TGPCB సిద్దమౌతుంది. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత కూడ నిర్వహించడం జరుగుతోంది.
చెరువుల్లో మట్టి మేటలని  తొలిగించటానికి  చెరువులో స్వచ్ఛత   కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసారు.

 

Previous article
Next article
దిలీప్ కొణతం అరెస్టు అక్రమం

-రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ

-ప్రజా పాలన అంటే ఇదేనా?
-మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం

హైద‌రాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయన సూటిగా ప్ర‌శ్నించారు.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం రేవంత్ రెడ్డి దమన నీతికి నిలువెత్తు నిదర్శనం అని ఆయన మండిపడ్డారు.
కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చునుకుంటే అది మీ భ్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత మంది పుట్టుకొస్తారని జీవన్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదన్నారు. రేవంత్ రెడ్డి  నిరంకుశ పాలనపై బీఆర్ ఎస్ పోరాడుతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments