స్టేషన్ ఘనపూర్ ఏ సి పి కార్యాలయాన్ని తనిఖీ చేసిన సి పీ..
*నీజాయితీతో పని చేసి ప్రజల మన్ననలను పొందండి*
*వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
నీజాయితీతో పని చేసి ప్రజల మన్ననలను పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వార్షిక తనీఖీల్లో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ ఏసిపి కార్యాలయమును వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం తనీఖీ చేసారు. తనీఖీ భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఏసిపి కార్యాలయము నకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, ఏసిపి అధ్వర్యంలో దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అరా తీయడంతో పాటు, గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ ఏసిపి కిషన్ అడిగి తెలుసుకొవడంతో పాటు, పెండిరగ్‌లో వున్న ఎస్‌స్టీ,ఎస్సీ కేసులు, ఇతర గ్రేవ్ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా పరకాల సబ్`డివిజినల్ పోలీస్ అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని,ప్రతి పోలీస్ స్టేషన్‌తో పాటు, బ్యాంకులు, ఇతర ప్రధాన కూడళ్ళల్లో సిసి కెమెరాలు ఏర్పాటు అధికారులు చోరవ చూపించాలని, నేరాల కట్టడి కొసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే స్టేషన్ అధికారులు వేగంగా స్పందించాలని. చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితిలో వదలవద్దని, సమాజంలో ఏం జరుగుతోందని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, ముందస్తూ సమాచార సేకరణ అవరమని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, ఓపిక,సహనంతో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పరిశీలించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు.
ఈ తనీఖీలో వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ , ఎ. ఎస్పీ మన్నన్ భట్,ఏసిపి భీం శర్మ ,స్టేషన్ ఘన్పూర్ సబ్`డివిజనల్ పోలీస్ అధికారులు, ఇన్స్‌స్పెక్టర్ జి. వేణు, రఘునాథ్ పల్లి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,, ఎస్.ఐ లు వినయ్ కుమార్, రమేష్, నవీన్ కుమార్, నరేష్, శ్రవణ్ కుమార్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.