సంగారెడ్డి జిల్లా
*కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం*
వచ్చే నెల 25 నుండి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.
*జిల్లా అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష.
వచ్చే నెల 25 నుండి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.
బుధవారం ఖరీఫ్ 2024 -25 సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో
రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ, పోలీస్ శాఖ రవాణా శాఖ, అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో వరి సాగు 1,49,370 ఎకరాలలో వరి పంట సాగు చేసారని, 37342.50 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోలు కోసం ఈనెల 25 నుండి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు.
క్రాఫ్ బుకింగ్ వివరాలు వ్యవసాయ శాఖ అందించాలన్నారు. రైతులు తూర్పారబట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సూపర్ ఫైన్ రకానికి క్వింటాలుకు రూ .2320 రూపాయలు కామన్ వెరైటీ ధాన్యానికి రూ.2300 రూపాయలు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ 500 అదనంగా చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలను తేమశాతం కొలిచే యంత్రాలు ధాన్యం తూర్పారాబట్టే యంత్రాలు తార్పాలియన్ కాగితాలు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు ధాన్యం సేకరణ ముగిసే వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో లారీలను సమకూర్చాలని రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ధాన్యం ఎగుమతులు దిగుమతులు వెంట వెంటనే జరిగేలా అవసరమైన సంఖ్యలో మిల్లర్లు తోపాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం నిలువ చేసేందుకు సరిపడా గోదాములను ఇతర ప్రదేశాలను గుర్తించాలని అధికారులకు సూచించారు అకాల వర్షాలకు దాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలన్నారు. నిర్ణీత తేమ శాతం ఉన్న ధాన్యం తూర్పారబట్టి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ధాన్యం సేకరణలో ఉత్పన్నమయ్యే సమస్యలను అధికారులు వెంట వెంటనే పరిష్కరించాలన్నారు కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వెంటనే మిరులకు తరలించేలా చూడాలన్నారు జిల్లా యంత్రాంగం తరపున రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు మిల్లర్లు సమన్వయంతో పని చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజవుగా సాగేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డి ఎం సివిల్ సప్లై కొండలరావు, డి.ఎస్.పి సత్తయ్య, రవాణా శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, తూనికలు కొలతల అధికారులు శాఖల అధికారులు పాల్గొన్నారు