Thursday, December 26, 2024
HomeUncategorizedపర్యావరణ హిత మట్టి వినాయకులను పూజిద్దాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

పర్యావరణ హిత మట్టి వినాయకులను పూజిద్దాం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

జిహెచ్ఎంసి ద్వారా 3.10 లక్షల విగ్రహాల పంపిణీ

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 05:  గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. 

గురువారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో జిహెచ్ఎంసి ఉద్యోగులు, సిబ్బందికి మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను మేయ‌ర్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను చైత‌న్య పర్చడంలో భాగంగా జిహెచ్ఎంసి ద్వారా మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్స‌రం జిహెచ్ఎంసి ద్వారా 3.10 లక్షల మ‌ట్టి వినాయక విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. అందులో 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ పంకజ, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.  

Previous article
Next article
*ఫలక్ నూమా ఆర్.ఓ.బి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ ఆమ్రపాలి కాట*

*హైదరాబాద్, సెప్టెంబర్ 05:*   ఫలక్ నూమా ఆర్.ఓ.బి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. 

గురువారం కమిషనర్ ఆమ్రపాలి చార్మినార్ జోన్ లో పర్యటించి చేపట్టనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బండ్లగూడ ఫ్లైఓవర్ జంక్షన్ పనులను పరిశీలించారు. బండ్లగూడ నుండి ఎర్రకుంట వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ, తులసీ నగర్ నుండి గౌస్ నగర్ వయా మైలార్ దేవల పల్లి కాటేదాన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, ట్రిబ్యునల్ నుండి టిప్పు ఖాన్ మజీద్ వరకు, ఇంజన్ బౌలి, బాబా బజార్ నుండి భవాని నగర్ వరకు షేక్ ఫైజ్  కమాన్ నుండి డబీర్ పుర ఫ్లైఓవర్ వరకు ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫలక్ నూమాలో చేపట్టనున్న ఆర్.ఓ.బి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సందర్భంగా కమిషనర్ ప్రతిపాదిత రోడ్డు విస్తరణ. పనుల కోసం  కావల్సిన భూసేకరణ  పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సి ఈ దేవానంద్, ఎస్ ఈ దత్తు పంతు, చార్మినార్ జోన్ సిటీ ప్లానర్ మాజిద్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————————–
*- సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీ చేయడమైనది.*
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments