*పవన్ కళ్యాణ్ పై ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..*
ఎన్డీయే కూటమి నేతల సమావేశంలో సీఎం నారా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు తెలిపారు. 2014 పొత్తు సమయంలో పోటీ చేయకుండా అందరి కోసం పవన్ కళ్యాణ్ పని చేశారని తెలిపారు. తాను జైల్లో ఉన్న కష్ట కాలంలో పొత్తు ప్రకటించారని చంద్రబాబు అన్నారు..