

పార్వతిపురం *మన్యం జిల్లా* భామిని మండలం పాత ఘనసర గ్రామంలో ఏనుగులు నష్టపరుస్తున్న పంటలను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరిశీలించారు .ఈ సందర్భంగా స్థానిక రైతులు ఏనుగుల వలన తమకు జరుగుతున్న నష్టాల్ని వివరించారు. ఆ ప్రాంతం నుంచి ఏనుగులను పూర్తిగా తరలించాలని కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన శాసనసభ్యులు జిల్లా అటవీ శాఖ అధికారిణి శ్రీమతి ప్రసున, జిల్లా కలక్టర్ శ్యాం ప్రసాద్ తోనూ మరియు రాష్ట్ర అటవీ అధికారి ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వెటర్ చిరంజీవి చౌదరి తో విషయాన్ని వివరించారు. గత 5 సంవత్సరాలుగా ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తూ, ప్రాణ నష్టం కలిగిస్తూ భీభత్సం సృష్టిస్తున్నయని తెలిపారు. తక్షణమే ఏనుగులను తరలింపు చేయడానికి చర్యలు తీసుకోవాలని, గత 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పంట నష్టం విడుదల చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, ఏనుగుల వలన జరుగుతున్న నష్టంపై గత ప్రభుత్వం, గత పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇక్కడ జరుగుతున్న నష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, అధికారుల వలన కాకపోతే రైతులకు వీటిని తరలించే భాద్యత అప్పగించాలన్నారు. ప్రజలపై కేసులు పెడితే సహించేది లేదన్నారు. గత పాలకులు రైతుల ప్రాణ, ధన రక్షణలో అశ్రద్ధ వహించడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్ నాయకులు మెడిబోయిన జగదీష్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డెరైక్టర్ గర్భాన సత్తిబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మోజూరు తేజోవతి, మాజీ ఎంపిపి భూపతి ఆనంద్, భామిని టిడిపి మండల అధ్యక్షులు బోగపురపు రవినాయుడు, బిజెపి మండల సీనియర్ నాయకులు తిరుపతి రావు, జనసేన మండల అధ్యక్షులు రుంకు కిరణ్, సీనియర్ నాయకులు పొన్నాడ నాగేశ్వర రావు, మరియు కూటమి నాయులు, కార్యకర్తలు,బాధిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు