*పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తక్షణమే అందుబాటులో కి రావాలి: నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి*
▪️వాహనాల నిర్వహణ, శానిటేషన్ అధికారులతో సమిక్ష సమావేశం…
వరంగల్ సెప్టెంబర్19( సమయం న్యూస్)
పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తక్షణమే అందుబాటులో కి రావాలని నగర క్మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాహనాల ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ లతో జరిగిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సానిటేషన్ నిర్వహణ సంబంధిత వాహనాలు మరమ్మతుల కోసం వస్తే వెంటనే రిపేర్లు పూర్తి చేయించాలని అన్నారు.
సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్,
శానిటేషన్ ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని, అధికారులు సమన్వయం తో
సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్
నిర్వహణ ప్రక్రియలో ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. అన్ని డివిజన్ లలో సానిటేషన్ మెరుగుపడడానికి సిబ్బంది అధికారులు సమష్టిగా పని చేయాలని ఈ సందర్భం గా మేయర్ అన్నారు.
బల్దియా వ్యాప్తంగా వీధి దీపాల నిర్వహణ క్రమబద్ధంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
నయింనగర్ బ్రిడ్జి , సుందరికరణలో భాగంగా వర్టికల్ గార్డెన్స్,తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్ ఇన్చార్జి ఎస్ ఈ రాజయ్య హెచ్ ఓ రమేష్ ఈ ఈ మహేందర్ శానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.