Tuesday, December 10, 2024
HomeUncategorizedపోస్టు మర్తానికి వైద్యులు ఏర్పాట్లు

పోస్టు మర్తానికి వైద్యులు ఏర్పాట్లు

బ్రతికే ఉన్నానంటూ యువకుడి కేకలు..

*🇨🇭✂️పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!*

*😳షాక్ అయిన వైద్యులు🩺*

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు
చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
పోస్టుమార్టం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా కదలిక
ఆపై బతికే ఉన్నానంటూ కేకలు
విచారణకు ఆదేశించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చనిపోయాడని భావించిన వైద్యులు పోస్టుమార్టంకు సిద్ధపడగా అతడి కేకలతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ బుధవారం రాత్రి తన సోదరుడితో కలిసి బైక్‌పై ఖతౌలీ వైపు వెళ్తుండగా ఓ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. స్ట్రెచర్‌పై మార్చురీకి తరలిస్తున్న సమయంలో ‘సార్.. నేను బతికే ఉన్నా’ అని షగుణ్ కేక వేయడంతో వైద్యులు షాకయ్యారు. వెంటనే అతడిని మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించారు.

Previous article
Next article
*2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం*

*భారతీయ మార్కెట్లో అమ్ముతున్న  పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది..*                                                     

*భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన2025 నాటికీ 87శాతం మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని WHO చెప్పింది*.                   

ఈ కల్తీ పాలను నియంత్రించకపోతే భారతదేశం క్యాన్సర్ బారిన పడటం కాయం
కేవలం సిటీ లలోనే కాదు ప్రతి పల్లెటూరు లలో ఈ కల్తీ పాల వ్యాపారం చేస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

యూరియా, పెట్రోలియ్మ్ ప్రోడక్ట్ లతో తయారు చేస్తున్నారు అక్రమ సంపాదన ద్యేయం…..

తనిఖీ చేసిన అధికారులకు కొంత సొమ్ము ముట్ట చెప్పడంతో అధికారులు మౌనం వహిస్తున్నారు….

అధికారులె కాదు సామాన్యులు కూడా వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది…
అసలు ఎన్ని పాలిచ్చే గేదెలు. ఆవులు ఉన్నాయి ఎన్ని పాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది…
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments