ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు
మొదటి రోజులో భాగంగా. ఈరోజు ఉదయం రెండు కిలోమీటర్ల పరుగు పెద్ద పెళ్లి జిల్లా కోర్టు రంగంపల్లి నుండి కమాన్ మీదుగా తిరిగి జిల్లా కోర్టు రంగంపల్లి వద్ద ముగిం చడం జరిగినది . ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి అక్క పాక సురేష్, జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి వి హనుమంతు, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ప్రెసిడెంట్ వి సురేందర్ ,జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి షఫీ యుద్దీన్ ,జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీధర్, బిసి హాస్టల్ 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంజయ్య, జిల్లా పాఠశాలల క్రీడా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరోజు శ్రీనివాస్, బిసి హాస్టల్ లోని యువకులు పీడీలు ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొని 2 కిలోమీటర్ల పరుగును విజయవంతం చేసినారు. ఈ వార్త మీ అమూల్యమైన పత్రికలో ప్రచురించవలసినదిగా కోరుచున్నాను
అక్కపాక సురేష్
జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి పెద్దపల్లి