Tuesday, January 21, 2025
HomeUncategorizedప్రజా విజయోత్సవాలు విజయవంతం లో పురపాలక శాఖ క్రియాశీలక పాత్ర.

ప్రజా విజయోత్సవాలు విజయవంతం లో పురపాలక శాఖ క్రియాశీలక పాత్ర.

*ప్రజాపాలన  విజయోత్సవాలు విజయవంతం*

– వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో కీలకపాత్ర పోషించిన పురపాలక శాఖ.
– వేడుకలకు హాజరైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు

– *తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, ప్రజలు*
– వేడుకలు సజావుగా నిర్వహించడంలో పురపాలక సక్సెస్


– *పురపాలక శాఖ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బంది కి ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ అభినందనలు*


హైదరాబాద్  ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, HMDA గ్రౌండ్ వేదికగా ఈ నెల 7 వ తేదీ నుంచి రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన
ప్రజాపాలన ముగింపు  విజయోత్సవాలు అయ్యాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ముగింపు వేడుకలను విజయతంగా నిర్వహించడంలో
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ నేతృత్వంలో GHMC,HMDA,CDMA, మెట్రో, వాటర్ బోర్డు అధికారులు కీలకపాత్ర పోషించారు . క్షేత్ర స్థాయిలో వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ లైట్ల ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం, బ్యారికెడ్ ల ఏర్పాటు, పార్కింగ్ స్థలాల గుర్తింపు నిర్వహణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మహిళల మోబి లైజేషన్ , నిరంతరం పారిశుద్ధ్యం కార్యక్రమాలు పురపాలక శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు.
సోమవారం సాయంత్రం సచివాలయం ప్రాంగణంలో సిఎం శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కు పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, ప్రజలు హాజరయ్యారు.
ముఖ్య కార్యదర్శి 3 రోజులు  కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికారులతో  సమన్వయం చేశారు.

ప్రజాపాలన ముగింపు విజయోత్సవాలు విజయవంతం అయ్యేలా కృషి చేసిన  GHMC కమీషనర్ ఇలంబర్తి, CDMA శ్రీదేవి, MC HMDA సర్ఫరాజ్ , MD HMWSSB అశోక్ మెట్రో రైల్ MD NVS రెడ్డి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మిగతా జోనల్ కమిషనర్  లు అడిషనల్ కమిషనర్లు ముఖ్యంగా జి హెచ్ ఎం సి  విజయవంతం లో జి హెచ్ ఎం సి పాత్ర అమోఘం కృషి చేసిన ప్రతి ఒక్క అధికారులు సిబ్బంది  పారిశుద్ధ్య కార్మికులుకు ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ అభినందనలు తెలిపారు.
ఇదే స్ఫూర్తి తోమున్ముందు  ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో  ముందుండాలని ఆశీస్తూ మరొక సారి ప్రతి ఒక్కరికీ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్  అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments