ప్రమోషన్ పాలసీ వెంటనే పూర్తి చేయాలి
= జీవో నెం. 266 చర్యలు పునపరిశీలించాలి
= కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం ముమ్మరం
= బీఎంఎస్ దక్షిణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ దొరై రాజు
హైదరాబాద్ డిసెంబర్ 17:-జీహెచ్ఎంసీలో క్రింది స్థాయి నుండి సూపర్ఇండెంట్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎప్పటికపుడు వారి అర్హతల ప్రకారం పదోన్నతులను కల్పించే ప్రమోషన్లు కల్పించే పాలసీని వెంటనే పూర్తి చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ దక్షిణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెకట్రరీ దొరై రాజు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య పార్కులోని ఎంటమాలజీ కార్మికులను, చాచా నెహ్రూపార్కులోని యూబీడీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఖైరతాబాద్ లోని కంప్యూటర్ ఆపరేటర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జవాన్,హెడ్ జవన్, ఆఫీసు సబార్డినేట్ నుండి రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ నుండి సూపరిండెంట్ వరకు ఎప్పటికపుడు ఉద్యోగులకు పదోన్నతులను కల్పించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ పొందిన రోజునే బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల పదవి విరమణ రోజునే చెల్లించాలి. అన్ని రంగాల్లోని కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేసేందుకు వీలుగా తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నట్లు దొరై రాజు వివరించారు. దాదాపు 70 ఏళ్ల క్రితం ఏర్పడిన బీఎంఎస్ నేటికీ కార్మికులు, ఉద్యోగు ప్రయోజనాల పరిరక్షణకు రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. 1980 కల్లా దేశంలోని ఫస్ట్ ట్రేడ్ యూనియన్ గా, నేడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యూనియన్ గా అవతరించిందని వివరించారు. బీఎంఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ తూర్పు రాంరెడ్డి మాట్లాడుతూ రూ.వేల కోట్ల లాభాల బాటలో ఉన్న జీహెచ్ఎంసీని గత పాలకులు అప్పుల ఊబిలోకి నెట్టేశారని, కనీసం రాష్ట్రప్రభుత్వ ఆస్తుల నుంచి రావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా రాకపోవటంతో ఖజానా దివాలా తీసిందని విమర్శించారు. జీవో నెం. 266 ప్రకారం ఉద్యోగుల మెడికల్ లీవ్ పెట్టినటైతే 360 రోజుల తరువాత పదవి నుండి తొలగిస్తున్నారు. ఇలా కాకుండా ఎందుకు లీవ్ పెట్టారు? అన్న విషయంపై కమిషనరే నేరుగా విచారించి, ఉద్యోగులను రీమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయకుండా చూడాలన్నారు.బీఎంఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ.కృష్ణ, ఉపాధ్యక్షులు వి.నాగమణి , అడిషనల్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కార్యదర్శి జి. రూపేష్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఇన్ ఛార్జి పవన్, జై కిషన్, ఎల్బీ నగర్ జోనల్ అధ్యక్షులు యాదయ్య , ఖైరతాబాద్ జోనల్ అధ్యక్షులు జి. సుదర్శన్, ఖైరతాబాద్ జోనల్ కార్యదర్శి. ఆర్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు రసూల్ , భారత్ కుమార్, బీఎంఎస్ సిటీ ఉపాధ్యక్షులు భిక్షపతి, కిషన్ ఆధ్వర్యంలో చాచా నెహ్రు పార్క్ లో దొరై రాజు కార్మికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు
*