Wednesday, March 12, 2025
HomeUncategorizedప్రాపర్టీ ట్యాక్స్ మొండి  బకాయిల పై జి హెచ్ ఎం సి నజర్

ప్రాపర్టీ ట్యాక్స్ మొండి  బకాయిల పై జి హెచ్ ఎం సి నజర్

*ప్రాపర్టీ ట్యాక్స్ మొండి  బకాయిల పై జి హెచ్ ఎం సి నజర్

జీహెచ్ఎంసీ  ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రతి ఏటా టార్గెట్ గా పెట్టుకునే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అలా ఉంచితే సుమారు 15 ఏళ్ల నుంచి వసూలు కాని రూ.11668 కోట్ల మొండి బకాయిలను ఈ సారి కొంతమేరకైనా వసూలు చేసుకునేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది . జి హెచ్ ఎం సి వ్యాప్తంగా  ఉన్న మొత్తం మొండి బకాయిల్లో సుమారు 4 వేల ఆస్తులకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ బకాయిలు 5 వేల కోట్లుండగా, సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన మరో 600 ప్రాపర్టీలకు చెందిన పన్ను బకాయిలు సుమారు రూ. 500 కోట్ల వరకున్నాయి. ఇంకా తాళాలు వేసి ఎలాంటి ఉపయోగంలోని భవనాలతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని కొందరు బడా బాబుల మొండి బకాయిలతో కలిపి పేరుకుపోయిన రూ.11 వేల 668 కోట్ల పన్ను బకాయిల  వసూలుకు  జి హెచ్ ఎం సి  ఈ సారి చేపట్టిన నోటీసుల జారీ, వారెంట్లు, జారీ ప్రాపర్టీ సీజ్ వంటి చర్యలతో కనీసం రూ.500 కోట్ల మేరకైనా వసూలు చేయాలనీ  జీహెచ్ఎంసీ అధికారులు అంచనాలు వేస్తున్నారు
.ట్యాక్స్ కలెక్షన్ కోసం రెవెన్యూ రికవరీ యాక్టు సెక్షన్ 269(2) ప్రకారం ఈ నెల 18 నుంచి ప్రారంభించిన వారెంట్, సీజ్ ప్రక్రియలు సత్పలితాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని బంజారా హోటల్ ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి రూ, కోటి 43 లక్షలు ట్యాక్స్ బాకీ పడగా, రెండుసార్లు నోటీసులు జారీ చేసిన యాజమాన్యం స్పందించకపోవటంతో ఆ హోటల్ ను గురువారం స్థానిక  మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.మరుసటి రోజైన శుక్రవారం హొటల్ యాజమాన్యం జీహెచ్ఎంసీకి ఆర్టీజీఎస్ ద్వారా రూ.51 లక్షల పై చిలుకు ట్యాక్స్ ను ఆన్ లైన్ లో చెల్లించినట్లు, మిగిలిన ట్యాక్స్ ను మార్చి 15 వరకు చెల్లిస్తామంటూ కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ యాక్షన్ ఫలితానివ్వటంతో ఇక మున్ముందు నగరంలోని మొండి బకాయిలపై ఇలాంటి సీజింగ్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు అధికారులు సిద్దమైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఒక్కోక్క సర్కిల్ లో డైలీ అయిదు ప్రాపర్టీల సీజ్ చేసేందుకు జి హెచ్ ఎం సి కసరత్తు చేస్తున్నది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనైనా క ఆర్థికంగా ఊరటను కల్గించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సరిగ్గా పదేళ్ల క్రితం 2014-15 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కమిషనర్ సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను రూ. వెయ్యి కోట్ల మార్కు దాటించినట్లే, ఈ సారి కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ కలెక్షన్ ను కనీసం రూ.2 వేల కోట్లు దాటించేందుకు అధికారులు వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం. ఈ వ్యూహాం పలించేందుకు గాను ఒక్కో సర్కిల్ లో డైలీ కనీసం అయిదు ప్రాపర్టీలను సీజ్ చేయాలని ఉన్నతాధికారులకు సర్కిల్ స్థాయి సిబ్బందికి టార్గెట్ గా విధించినట్లు సమాచారం.

*12.5 లక్షల మంది పన్ను చెల్లింపు*

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కళ్ల పరిధిలోని సుమారు 300 డాకెట్లలో సుమారు 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులున్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపు దారులుండగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపుదారులు మినహా మిగిలిన 17 లక్షల మంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారుల్లో ఇప్పటి వరకు సుమారు 12 లక్షల 50 వేల మంది దాదాపు రూ.1484 కోట్ల పన్ను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. లక్ష్యానికి మిగిలి ఉన్న రూ.516 కోట్లను మార్చి నెలాఖరుకల్లా వసూలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు.ఇందుకు గాను ట్యాక్స్ వసూలు చేసే 343 మంది బిల్ కలెక్టర్లు, 150 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు బకాయిదారులతో సంప్రదింపులు జరపాలని అధికారులు ఆదేశించారు. దీంతో పాటు బకాయిదారులకు డైలీ ప్రధాన కార్యాలయం ట్యాక్స్ సెక్షన్ నుంచి ఎస్ఎంఎస్ లను కూడా పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.
*రాయితే తో పన్ను చెల్లింపు ఉండదు*
ప్రతి ఏటా మొండి బకాయిలు వసూలుకు  90 శాతంవడ్డీ రాయితీ  జి హెచ్ ఎం సి  కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో  అలాంటి అవకాశం కేందంటూ జి హెచ్ ఎం సి అధికారులు అనుకుంటున్నారు.
గత సంవత్సరం  90 శాతం వడ్డీ రాయితీ తో కొన్ని కేంద్ర రాష్ట్రానికి చెందిన సంస్థలు పెండింగ్ బజాయి రాయితే పొంది i లాభ పడ్డాయి కానీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి వచ్చిన నేపథ్యంలో జి హెచ్ ఎం సి  ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.. గత సంవత్సరం  ఈ అంశం పై సుమారు 320 కోట్లు వసూలు అయినట్లు తెలిసింది
ప్రస్తుత సంవత్సరంలో అలాంటి ఛాన్స్ లేదంటూ అధికారులు అంటున్నారు
ఇంకా ఎన్ని సంవత్సరాల నుండి రాయితీ లు కల్పిస్తామమంటూ పన్ను సకాలంలో చెల్లించనీ వారికి రాయితీ నీ గత కొన్నేళ్ల నుండి అమలు చేస్తున్నప్పటికీ ఇంకా ఎంత కాలం  ఇవ్వాలంటూ  జి హెచ్ ఎం సి అధికారులు.అంటున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments