Wednesday, December 11, 2024
HomeUncategorizedప్లాగ్  డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి.:జిల్లా ఎస్పీ గౌస్ అలాం.

ప్లాగ్  డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి.:జిల్లా ఎస్పీ గౌస్ అలాం.

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్.

 జిల్లా ప్రజలు, విద్యార్థులు వారోత్సవాలలో పాల్గొనాలని ఎస్పీ పిలుపు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) ను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు కార్యాలయాలలో మరియు ప్రజల సమక్షంలో అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రజాహిత కార్యక్రమాల కు సంబంధించి వివరాలను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రజాహిత కార్యక్రమాలలో ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లాగ్ డే ను విజయవంతం చేయాలని తెలిపారు.

 అక్టోబర్ 21, ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం).

అక్టోబర్ 21న స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు కలిసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అమరవీరుల కుటుంబ సభ్యులకు అత్యంత గౌరవంతో ఆహ్వానించి బహుమతుల ప్రధానం చేయడం జరుగుతుంది.

 మెగా రక్తదాన కార్యక్రమం.

జిల్లా పోలీసులు మరియు ప్రజల సహకారంతో ఈనెల 26వ తారీకున స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు భారీ ఎత్తున మెగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 ఓపెన్ హౌస్ కార్యక్రమం.

 ఆన్ లైన్,అఫ్ లైన్ లలో నిర్వహించబడును.

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలల్లో, కళాశాలలో ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు పోలీసులు వినియోగించే ఆయుధాలు, చేయు విధులు, అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన అంశాలపై, పోలీసులు చేసిన ప్రతిభ, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. ఆఫ్లైన్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లో మండలల వారీగా విద్యార్థులను పోలీస్ స్టేషన్కు ఆహ్వానించి పోలీస్ స్టేషన్ నిర్వహణపై అవగాహనను కల్పించడం జరుగుతుంది.

 సైకిల్ ర్యాలీ

అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా పోలీసులు మరియు రెండవ బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా ఈనెల 25వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద అమరవీరుల చిత్రపటాల ఏర్పాటు.

వారోత్సవాలు మొదలు నుండి పూర్తి అయ్యేవరకు  ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద అమరవీరుల చిత్రపటాలను ఏర్పాటుచేసి జిల్లా ప్రజలకు వారి ప్రాణత్యాగాలను స్మరించుకోవడం జరుగుతుందని తెలిపారు.

 షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు.

జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు యువత ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, మరియు వీడియో గ్రాఫర్లకు, చిన్న డైరెక్టర్లకు, ప్రజలందరికీ పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా, రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలు కమ్యూనిటీ పోలీసింగ్ మూఢనమ్మకాలు ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన ప్రకృతి వైపరీత్యాలలో పోలీసులు చేసే సేవ, ఇతర పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్ ఫిలిం వీడియోలను రూపొందించాలని, ఉత్తమ మొదటి మూడు ఫోటోలను మరియు వీడియోలను జిల్లా స్థాయిలో బహుమతిని ప్రధానం చేస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ ఫోటోలను మరియు వీడియోలను ఈనెల 23 తారీకు లోగా వివరాలతో సహా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్ఐబి మరియు ఐటి కోర్ కార్యాలయంలో అందించాలని సూచించారు. డి డే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments