*’ఫెంగల్ ‘ తుఫాన్‌పై ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష..*
విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేసిన ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు..
వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..
ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచనలు..
తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవిస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్న సీఎం..
తుఫాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు..