హైదరాబాద్ సెప్టెంబర్18 :-;సమయం న్యూస్
*బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా జాయినింగ్ రిపోర్ట్
ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ బుధవారం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా విధులకు హాజరయ్యారు. ఆమె తన జాయినింగ్ రిపోర్టును డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ బుధవారం అందజేసారు.,
నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది , కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొంది.
రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్‌ను డీఎస్పీ (స్పెషల్ పోలీస్)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తన జాయినింగ్ రిపోర్టును డీజీపీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేసి రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకొని రావడం జరుగుతుందని ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.