
*అర్ధరాత్రి బట్టలు మార్చుకునే టైమివ్వకుండా నన్ను అరెస్ట్ చేసి వేధించారు*
*అయినా బెదరకుండా పోరాడి కేసీఆర్ మెడలు వంచిన*
*6 గ్యారంటీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ తో ప్రజలకు ఒరిగిందేమిటి?*
*కాంగ్రెస్ మోసాలపైనా యుద్దం ప్రకటించినం*
*నమ్మకద్రోహి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పే టైమొచ్చింది*
*బీజేపీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కాంగ్రెస్ పై యద్ద భేరీ మోగిస్తాం*
*ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని సర్వే సంస్థలన్నీ తేల్చేశాయి*
*కాంగ్రెస్ లో పోటీ చేసే వాళ్లే లేక బయట నుండి వ్యక్తిని తెచ్చి బరిలో నిలబెట్టారు*
*టీఆర్ఎస్ కు పోటీ చేసే ముఖం లేక బరి నుండి తప్పుకుంది*
*బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి పోరాడే కార్యకర్తల్లో మనోధైర్యం నింపండి*
*గ్రాడ్యుయేట్లు, టీచర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి*
*కామారెడ్డిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్*
ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న తనను అవమానకరంగా అరెస్ట్ చేయించి ఇబ్బంది పెడితే ఇతరులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయరనే ఉద్దేశంతో నాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేక రకాలుగా అవమానించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘ఆనాడు మా అత్తమ్మ చనిపోతే పక్షి ముట్టే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇంటికి వస్తే…. కేసీఆర్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి నా ఇంటిపై పోలీసులు దాడి చేసి బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా జీపులో ఎక్కించుకుని పోయి రాత్రంతా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి వేధించారు. అయినా భయపడలే. కేసీఆర్ పై పోరాటాన్ని కొనసాగించిన. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన. కేసీఆర్ ను గద్దె దించిన.’’’అని చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏ మార్పు లేదని అన్నారు. 6 గ్యారంటీల పేరుతో మోస పూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేయడంతోపాటు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. పట్టభధ్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు అన్ని వర్గాల పక్షాన అలుపెరగని పోరాటాలు చేస్తున్న బీజేపీకి అండగా నిలిచేందుకు మళ్లీ సమయం వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. తద్వారా పోరాడే కార్యకర్తలకు బలం చేకూర్చాలని విజ్ఝప్తి చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, స్థానిక బీజేపీ నేతలతో కలిసి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగం పాఠం వివరాలిలా ఉన్నాయి….
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీ బలపర్చిన అభ్యర్థులదేనని సర్వే సంస్థలన్నీ తేల్చేశాయి. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఓటుకు 7 నుండి 10 వేల రూపాయలిస్తోంది. బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువై పోటీ నుండే తప్పుకుంది. కాంగ్రెస్ నుండి పోటీ చేసే వాళ్లు లేకపోవడంతో బయట నుండి వచ్చిన వ్యక్తులను తీసుకొచ్చి బరిలో నిలబెట్టారు. కాంగ్రెస్ లో పోటీ చేసే వాళ్లే లేక బయట నుండి వ్యక్తిని తెచ్చి బరిలో నిలబెట్టారు. టీఆర్ఎస్ కు పోటీ చేసే ముఖం లేక బరి నుండి తప్పుకుంది. 6 గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పుందుకు మేధావులు సిద్ధమయ్యారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచినా మళ్లీ అధికార పార్టీలోనే కలుస్తారు. కానీ పట్టభద్రులు, ఉద్యోగుల కోసం తెగించి కొట్లాడి అండగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమే. ప్రపంచంలోనే బీజేపీ నెంబర్ వన్. సభ్యత్వంలో బీజేపీ నెంబర్ వన్. విజయంలోనూ నెంబర్ వన్. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా నెంబర్ వన్. నెంబర్ 1 కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి.
మోసాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను మించిపోయింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాట తప్పింది. నెలకు రూ.4వేల నిరుద్యోగ భ్రుతి ఇవ్వకుండా మోసం చేసింది. టీచర్లకు డీఏల్లేవు. జీపీఎఫ్ లో దాచుకున్న పైసలు కూడా ఇయ్యడం లేదు. పీఆర్సీ లేదు.
ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన వెంకటరమణారెడ్డి నిజంగా జెయింట్ కిల్లర్. ఆయనో ఫైర్ బ్రాండ్. మంచి ఇమేజ్ వచ్చింది. కామారెడ్డి ప్రజలు గ్రేట్. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బుద్ది చెబుతారనే నమ్మకం ఉంది.
ప్రజల పక్షాన కొట్లాడింది బీజేపీ మాత్రమే. వడ్ల కొనుగోలు కోసం నల్లగొండ జిల్లాకు వెళితే బీఆర్ఎస్ నేతలు రాళ్లదాడి చేసి భయపెట్టాలని చూశారు. అయినా బెదరకుండా ఉద్యమించి రైతుల పక్షాన నిలిచిన పార్టీ బీజేపీ మాత్రమే. ఉద్యోగుల పక్షాన దెబ్బలు తిన్నది, 317 జీవోకు వ్యతిరేకంగా లాఠీదెబ్బలు తిని జైలు పాలైంది బీజేపీ. కరీంనగర్ ఎంపీలో నేను దీక్ష చేస్తుంటే కేసీఆర్ ఆదేశాల మేరకు గ్యాస్ కట్టర్ తో ఆఫీస్ ను ధ్వంసం చేసి ఫైర్ ఇంజిన్ పైపులతో వాటర్ వదిలారు. కిటికీ అద్దాలు పగలకొట్టి కార్యకర్తలకు గాజుపెంకులు కుచ్చుకుని రక్తం కారుతున్నా కనికరం లేకుండా బరబరా గుంజుకుపోయి జైల్లో వేశారు. అయినా వెరవకుండా ఉద్యమించిన పార్టీ బీజేపీ. నిరుద్యోగుల పక్షాన కొట్లాడి రక్తం చిందించింది బీజేపీ. టీచర్లకు నెలనెలా జీతాలొచ్చేలా కొట్లాడి సాధించింది బీజేపీ మాత్రమే. పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన మేం పోరాడుతుంటే… తపస్ మినహా ఏ ఒక్క ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ముందుకు రాలేదు. సంఘీభావం తెలపలేదు. ఉద్యోగులను పట్టించుకోలేదు. అట్లాంటి సంఘాలు మీ ముందుకొస్తే ఓటేస్తారా?
నేను ప్రజల పక్షాన ఉద్యమిస్తుంటే ఓర్వలేక కేసీఆర్…ఆనాడు మా అత్తమ్మకు పిండ ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి వస్తే…. నన్ను బట్టలు వేసుకునే టైం కూడా ఇవ్వకుండా బరబరా గుంజుకుపోయి అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చిండు. ఆనాడు అర్ధరాత్రి నా ఇంటిపై పోలీసులు దాడి చేసి బట్టలు వేసుకునే టైం కూడా ఇవ్వకుండా జీపులో ఎక్కించుకుని పోయి రాత్రంతా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి వేధించారు. అయినా భయపడలే. కేసీఆర్ మెడలు వంచిన. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది. అధికారంలోకి వస్తే ఉచితంగా లే అవుట్ క్రమబద్దీకరణ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్లు దండుకునేందుకు సిద్ధమైంది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. అడుగడుగునా మోసం చేస్తోంది. తెలంగాణ సర్వనాశనమైతోంది.
మీకోసం బీజేపీ కార్యకర్తలు తెగించి కొట్లాడారు. కుటుంబాలకు దూరమై మీ కోసం పోరాడుతున్నారు. 24 గంటలపాటు మీకోసమే పనిచేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసినా, జైలుకు పంపినా భయపడటం లేదు. అలాంటి కార్యకర్తలు మమ్ముల్ని అడుగుతున్నారు. మీ కోసం పోరాడినందుకు ఒక్కో కార్యకర్తపై 30 నుండి 40 కేసులున్నయ్. ఇన్ని పోరాటాలు చేసినందుకైనా బీజేపీకి ఓటేస్తారా? లేదా? అని అడుగుతున్నరు. బీజేపీకి ఓటేయకపోతే పోరాటాలు ఎందుకు చేయాలని అడిగితే మేం ఏం సమాధానం చెప్పాలే. ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఇప్పుడు పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు తగిన తీర్పు ఇచ్చే అవకాశం వచ్చింది. దయచేసి బీజేపీకి ఓటేసి పోరాటాలకు మద్దతివ్వాలని కోరుతున్నా.
పొరపాటున ఇతర అభ్యర్థులు ఎవరు గెలిచినా వారంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రమాదముంది. ఇదేందని అడిగితే అభివ్రుద్ధి కోసమేనని కుంటి సాకులు చెబుతారు. వాళ్ల సొంత కుటుంబం, ఆస్తులు అభివ్రుద్ధి చేసుకోవడానికే తప్ప ప్రజలకు వాళ్లు ఒరగబెట్టేదేమీ లేదు. కాబట్టి బీజేపీ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. బీజేపీ అభ్యర్థులు గెలిచిన వారం రోజుల్లోనే అవినీతి, నయవంచన కాంగ్రెస్ సర్కార్ పై యుద్దం ప్రకటించబోతున్నం. ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. దయచేసి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా నిర్ణయం తీసుకోవాలని, పోరాటాలకు బలమిచ్చేలా, కొట్లాడే కార్యకర్తలకు మనోధైర్యమిచ్చేలా ఓట్లతో తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.