Friday, December 27, 2024
HomeUncategorized*బురదను తొలగించి... ఇళ్లను కడిగించే పనిలో...100కు పైగా ఫైరింజన్లు*అమరావతి: (సమయం న్యూస్) ముంపు  పుబారిన పడి...

*బురదను తొలగించి… ఇళ్లను కడిగించే పనిలో…100కు పైగా ఫైరింజన్లు*

అమరావతి: (సమయం న్యూస్) ముంపు  పుబారిన పడి వరద నీరు, బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లను రాష్ట్రప్రభుత్వమే శుభ్రం చేయిస్తోంది.

అగ్నిమాపక శకటాలను, సిబ్బందిని పంపించి ఇళ్లలోని బురదను తొలగించి.. తర్వాత మంచినీటితో శుభ్రం చేయించి, బాధితులకు అప్పగిస్తోంది. ముంపు బారి నుంచి బయపడిన ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచే ప్రారంభమైన ఈ పనులు గురువారం విజయవాడలోని వన్‌టౌన్, అజిత్‌సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగాయి. 100కు పైగా పెద్ద ఫైర్‌ ఇంజిన్లు, 10 చిన్న ఫైర్‌ ఇంజిన్లు, 110 పోర్టబుల్‌ పంపులతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఈ పనులు చేపట్టారు. ప్రతి డివిజన్‌కూ ఒక ఫైరింజన్‌ను అధికారులు కేటాయించారు. ఒక్కో ఇంటినీ శుభ్రం చేసేందుకు దాదాపు 20 నిమిషాలు పడుతోంది. ప్రతి అగ్నిమాపక వాహనానికీ 12 మందితో కూడిన పారిశుద్ధ్య బృందాన్ని, ఓ వైద్యబృందాన్ని జతచేశారు. ఇళ్లను శుభ్రం చేసిన అనంతరం వైద్యబృందం ఆ ప్రాంతాల్ని శానిటైజ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments