
*బైకులు, కార్లు ఉన్న వారికి బిగ్ షాక్..
20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది.. వాహన కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా 20 ఏళ్లు పైబడిన టూ వీలర్ కోసం ₹2 వేలు, త్రీ వీలర్ కోసం ₹5 వేలు, కార్లు ₹10 వేలు, మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనాలకు ₹25 వేలు, హెవీ వెహికల్స్ కు ₹36 వేలు వసూలు చేయనుంది. అలాగే, 15 ఏళ్లు పైబడిన మీడియం ప్యాసింజర్ వాహనాలకు ₹12 వేలు, హెవీ వాటికి ₹18,000 వసూలుకు ప్రతిపాదించింది..