Friday, December 6, 2024
HomeUncategorizedభక్తుల సేవలో జి హెచ్ ఎం సి

భక్తుల సేవలో జి హెచ్ ఎం సి

కమిషనర్ ఆమ్రపాలి కాట.

*గణేష్ నిమజ్జనానికి  పటిష్ట ఏర్పాట్లు పూర్తి*
*భక్తుల సేవలో జి హెచ్ ఎం సి*
*భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు*
,*ప్రశాంత వాతావరణంలో గణేశ నిమజ్జనం  భక్తులకు విజ్ఞప్తి*
*73 పాండ్స్, 5 పెద్ద చెరువులు వద్ద నిమజ్జన ఏర్పాటు పూర్తి*
*జి హెచ్ ఎం సి కమిషనర్ ఆమ్రపాలి కాట*
*హైదరాబాద్ సెప్టెంబర్ 15*:- హైదరబాద్ లో ఈ నెల 17 జరుగు గణేష్ నిమజ్జనం కొరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు  తలెత్త కుండా  పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జి హెచ్ ఎం సి కమిషనర్ తెలిపారు.
గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్లే   శోభ యాత్ర నుండి నిమజ్జనం చేసే   ప్రదేశం వరకు ఎవ్వరికీ ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
మండపం నుండి నిమజ్జనం జరుగె కొలను చెరువుల వరకు  భక్తులకు సమస్యలు లేకుండా  రహదారి మరమ్మత్తులు, స్ట్రీట్ లైట్,  ట్రీ ట్యూనింగ్  చర్యలు చేపట్టేందుకు పోలీస్, డిప్యూటీ కమిషనర్లు  విద్యుత్ సిబ్బంది , యు బి డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లు కమిటీ గా ఏర్పడి  మండపం  నిర్వాహకులు సూచన మేరకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నారని కమిషనర్ వివరించారు.
జి హెచ్ ఎం సి  భక్తుల సేవలదించెకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు
జి హెచ్ ఎం సి వ్యాప్తంగా 73పాండ్స్( కొలనుల.) ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటు లోకి తేవడం జరిగింది
అందులో 27 బెబి పాండ్స్, 24, ఫోర్టే బుల్, 22 ఎస్కలేటార్ పాండ్స్ ఏర్పాటు చేసి  భక్తులకు సమీపం లో ఏర్పాటు చేయడం జరిగింది.
73 పాండ్స్ లలో విద్యుత్, త్రాగునీరు శానిటేషన్,  24 గంటల పాటు  ఉండేలా చర్యలు మెన్ మెటీరియల్ ను సిద్దం చేయడం జరిగింది దాంతో పాటుగా అవసరమైన క్రీన్స్ లను కూడా సిద్దం గా ఉన్నాయి.
73 పాండ్స్ తో పాటుగా 5 పెద్ద చెరువుల వద్ద కూడా నిమజ్జనం ఏర్పాట్లు చేశారు
సరూర్ నగర్ పెద్ద చెర్వు,  జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహద్దూర్ పుర మిరాలం చెరువు,  కాప్రా ఊర చెరువు లోకూడా నిమజ్జన ఏర్పాట్లను  చేయడం జరిగింది.
భక్తుల  సేవలో  జి హెచ్ ఎం సి   ఉంటుందన్నారు
ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనానికి 172 రోడ్లు పనులు,36 ట్రాన్స్ పోర్ట్,
140 స్టాటిక్ క్రేన్ లు, 295 మొబైల్ క్రెన్స 160 గణేష్ యాక్షన్ టీన్స్, 102 మిని తిప్పర్స్,125 జే సి బి లుఎంగేజ్డ్,308 మొబైల్ టాయిలెట్స్,52,270 తాత్కాలిక స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసినట్లు అవసరమైన చోట  అన్నపూర్ణ బోజన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments