Tuesday, December 10, 2024
HomeUncategorizedభారీ భద్రత మధ్య అఘోరీనీ సొంత గ్రామానికి తరలించిన పోలిస్ లు.

భారీ భద్రత మధ్య అఘోరీనీ సొంత గ్రామానికి తరలించిన పోలిస్ లు.

*_భారీ భద్రత మధ్య మహిళా అఘోరీని సొంత గ్రామానికి తరలించిన పోలీసులు.._*

*_కొన్ని రోజులుగా తెలంగాణలో మహిళా అఘోరీ నాగసాధువు విషయం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మహిళా అఘోరీ తెలంగాణలోని పలు ఆలయాలను సందర్శిస్తూ వస్తోంది. బుధవారం కొండగట్టుపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే, ఈనెల 29న మహిళా అఘోరీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీన శుక్రవారం ఉదయం 9గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర లోక కల్యాణంకోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటన చేసింది. దీంతో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమయింది._*

*_నవంబర్ 1న ఆత్మార్పణ చేసుకుంటానని మహిళా అఘోరీ సంచలన ప్రకటన చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా ఆమెను సొంత గ్రామమైన మంచిర్యాలీ జిల్లా నన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య పోలీసులు తరలించారు. అనంతరం అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాక కుశ్నపల్లి గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి._*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments