![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241227-wa03266408217124136333549.jpg?resize=443%2C553&ssl=1)
![](https://i0.wp.com/samayamdaily.net/wp-content/uploads/2024/12/img-20241227-wa03125988408288830742641.jpg?resize=696%2C830&ssl=1)
*మన్మోహన్ హయాం లోనే తెలంగాణ ఆవిర్భావం.. ఏపీ ఎంపీలు వ్యతిరేకించినా వెనక్కి తగ్గని ధీశాలి..*
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి ప్రభుత్వం లోనే ముగింపు లభించింది.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం లోనే నెరవేరింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9న ప్రకటన వెలువడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు.
తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ, మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంటులో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు.. అప్పటి కేంద్ర హోం మంత్రి షిండే అన్నారు.
ఇక, అధికారం కోల్పోయాక కూడా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు..