ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి (మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్) హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో, ముఖ్యమంత్రి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు పై కీలక ఆదేశాలు జారీ చేశారు. నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పర్యాటక కేంద్రీకరణతో అభివృద్ధి చేయాలని, అలాగే జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలను మరింత విస్తరించాలని సూచించారు.
ప్రాజెక్ట్ కార్యాచరణలో పారదర్శకత, వేగవంతమైన అమలు, మెట్రో రైలు పైన యాత్రికులకు మరింత సౌకర్యాలు అందించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.