*మంత్రి. కొండ సురేఖ*
*యాదగిరి గుట్ట వద్ద ఇండియాలోనే అతి పొడవైన లింక్ బ్రిడ్జ్ నిర్మాణం* మంత్రి కొండా సురేఖ
యాదాద్రి దేవస్థానానికి రాకపోకల నిమిత్తం ఎగ్జిట్ ఫ్లై ఓవర్ పైనే ఆధారపడిన భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్ (ఎంట్రీ ఫ్లై ఓవర్) గొప్ప ఉపశమనం లభించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. మెకల్లై(mecalloy) స్టీల్ తో నిర్మించనున్న 64 మీటర్ల ఈ ఫ్లై ఓవర్ ఇండియాలోనే రెండవ అతి పొడవైన బ్రిడ్జ్ కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చి పెడుతుందని మంత్రి అన్నారు. 3 నెలల్లో ఈ లింకింగ్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టేలా మంత్రి సురేఖ దిశా నిర్దేశం చేశారు.