గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరుస్తాం.
**డిప్యూటీ కలెక్టర్లు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల ముఖాముఖి సమావేశంలో అంశాల వారీగా పరిష్కారానికి చర్యలు. వేదికపైనే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ గారిని ప్రక్రియ ప్రారంభించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశం
#స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంపు.
# సెలక్షన్ గ్రేడ్ గా నిర్దారించి (33)పోస్టులు అప్ గ్రేడ్.
# (17) మంది సీనియర్ అదనపు కలెక్టర్ కేడర్ అధికారులకు IAS పదోన్నతికి మార్గం సుగమం.
# డిప్యూటీ కలెక్టర్ నుండి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా( 50)మందికి పదోన్నతులు.
# (33) జిల్లాలలో డీఆర్వో పోస్టులు భర్తీ చేసే అవకాశం.
#పై నుండి పదోన్నతుల ఫైల్ కదిలితే మరో (80) మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఛాన్స్!
# రెవెన్యూ శాఖ ఉద్యోగులలో ఆత్మస్థైర్యం పెంచి కొత్త రెవెన్యూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే దిశగా రెవెన్యూ మంత్రి ఆలోచన!
# తహసీల్దార్ల ఎన్నికల బదిలీలు దసరా కానుకగా పూర్తి చేయాలని ఆదేశం.
#గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించుటకు ప్రభుత్వ నిర్ణయం.పూర్వ వీఆర్వోలు మరియు వీఆర్ఏల సేవలను వినియోగించుకోవాలనే ప్రతిపాదన.
#రైతులకు,సామాన్య ప్రజలకు మెరుగైన భూ సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం.
# రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచి జవాబుదారీ తనంతో కూడిన సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆలోచన.
ఈ కార్యక్రమంలో డీసిఏ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, నాయకులు బి.గీత, చంద్రారెడ్డి,మాధవి దేవి తదితరులు పాల్గొని వివిధ అంశాలపై సూచనలు అందించారు.