*రోడ్డు ప్రమాదాల నివారణ కు కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ (సీడీఓ)*
*డా,, గురువారెడ్డి సర్వేజనా ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందేలోపు డ్రైవర్లకు వీడియో రూపంలో అవగాహన..*
*మొదటి దశలో 15 కేంద్రాల్లో సీడివో అమలు*
*80 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరుగుతుండడంతో దానిని అరికట్టడానికి తెలంగాణ రవాణా శాఖ సరికొత్త వ్యూహం..*
*మరోవైపు యూనిసెఫ్ రవాణా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ తో విద్యార్థులకు అవగాహన…*
*రోజు వారీ రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రవాణా శాఖ ప్రత్యేక ప్రణాళిక – మంత్రి పొన్నం ప్రభాకర్*
రోడ్డు ప్రమాదాల్లో రోజురోజుకు పెరుగుతున్న మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తుంది. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థలతో సచివాలయంలోని సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2023 లో దేశంలో లక్షా 73 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ఇందులో 45 శాతం 35 సంవత్సరాలలోపు ఉన్న యువత రోడ్డు ప్రమాదాల్లో మరణించగా ఇందులో 44 శాతం మంది ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే 80 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు.
అయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి డా,, గురువారెడ్డీ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మొదటి దశలో ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లాలో 9 కేంద్రాలు , హైదరాబాద్ లో ఆరు రవాణా శాఖ కేంద్రాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే లైసెన్స్ తీసుకోవడానికి లెర్నింగ్ లైసెన్స్ కి శాశ్వత లైసెన్స్ కి మధ్య జరిగే వీడియో అవగాహన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. దీని ద్వారా కొత్తగా రోడ్డు మీదకి వస్తున్న వాహనదారులు ఈ 3 గంటల వీడియో ద్వారా కంపల్సరీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పిస్తారు.
దీనితో పాటు యునిసెఫ్ రవాణా విభాగం ద్వారా రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుండే వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించనున్నారు. వీటితో పాటు జనవరి నెలలో రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలోపు రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది రవాణా శాఖ అధికారులు 300 స్కూల్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
డా,, గురువారెడ్డి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు విడుదల ఉండదు..టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇప్పటికే ఇన్ఫోర్స్మెంట్ హెల్మెట్ & సీట్ బెల్ట్ రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు కటినతరం చేస్తుంది. రాంగ్ రూట్స్, జంపింగ్ రెడ్ లైట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు 20 రకాల కఠిన నిబంధనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేస్తున్నప్పటికీ డ్రైవర్లకు సైతం కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్ గురువారెడ్డి సర్వేజనా ఫౌండేషన్ ప్రతినిధులు రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
సమావేశంలో విద్యాశాఖ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, రవాణా శాఖ స్పెషల్ సెక్రెటరీ వికాస్ రాజ్, డిప్యూటీ సెక్రటరీ శోభా రాణీ, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు రమేష్ , మమతా, డాక్టర్ గురువారెడ్డి సర్వేజనా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.