Sunday, December 8, 2024
HomeUncategorizedవరంగల్ లో నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూల్.

వరంగల్ లో నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూల్.

*నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూల్*
వరంగల్ సెప్టెంబర్ 09( సమయం న్యూస్)
హంటర్ రోడ్ న్యూ శాయంపేట కి చెందిన వంగ సాయికృష్ణ MCA చదువుకొని ప్రస్తుతం బెంగళూరు కంపెనీ అయినా హ్యాండ్ డిజిటల్ అనే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి MCA లో క్లాస్మేట్ అయినా గుండాల.గణేష్ వరంగల్ కాపు వాడకు చెందిన వ్యక్తి ఇతని స్నేహితులైన మహేష్(ప్రైవేటు ఉద్యోగి) సందీప్ లు (సాఫ్ట్ వేర్) ఉద్యోగి వరంగల్ కొత్తవాడ, ఆటోనగర్ కు చెందినవారు.
వీరికి ఆదివారం వీకెండ్ కావడం తో వీరందరూ కలిసి సాయంత్రం 7 అందాజ  గంటల సమయంలో 
న్యూ శాయింపేట శివారులో గల రైల్వే ట్రాక్ ప్రక్కన కూర్చుని మద్యం సేవిస్తుండగా  వీరి ముందు నుండి టిప్పర్ వెహికల్స్ వెళుతుండగా వీరందరు కలిసి ఒంటరిగా వస్తున్న టిప్పర్ ఆపి దాని డ్రైవర్ తో  మేము ప్రెస్ రిపోర్టర్లము మరియు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ల మని చెప్పి మీరు ఇంత రాత్రి ఏమి తీసుకపోతున్నారు అని బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వకపోవడంతో అతని జేబులో ఉన్న డబ్బులు 400 మాత్రమే వుండడంతో బలవంతంగా తీసుకొని ఇంకా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే చంపుతామని బెదిరించి తన ఫోన్లో ఉన్న phone pe  చెక్ చేసి అందులో వున్న రూ.1500/- ను సాయి కృష్ణ యొక్క ఫోన్ పే కు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇంకా వారి ఓనర్ ని కూడా బెదిరిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. వాటి తో జల్సాలు చేయవచ్చని  అనుకొని
టిప్పర్ డ్రైవర్ ని టిప్పర్ లో ఎక్కించుకొని వంగ సాయి కృష్ణ అనే వ్యక్తి టిప్పర్ ని నడుపుకుంటూ వారి డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వారి సూపర్వైజర్ తో మేము రిపోర్టర్లను మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు మాకు కొంత డబ్బులు ఇవ్వండి లేకుంటే మిమ్మల్ని చంపుతా మని బెదిరించగా తన వద్ద డబ్బులు లేవు అని చెప్పడంతో అతనితో తన ఓనర్ అయినా నెమరిగొమ్ముల. సురేష్ రావు కి ఫోన్ చేయించి మేము రిపోర్టర్లము, హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లము మీ టిప్పర్లను పట్టుకున్నాము మీరు మాకు డబ్బులు ఇస్తే వదిలిపెడతాం అని బెదిరించగా మీరు డంపు యార్డ్ వద్దనే ఉండండి మేము డబ్బులు తీసుకొని వస్తాము అని చెప్పి కొద్దిసేపటికే నెమరిగొమ్ముల సురేష్ రావు ఎక్కువమందితో కలిసి అక్కడికి చేరుకోగా అక్కడ ఉన్న నలుగురు 1. వంగ సాయి కృష్ణ 2. గుండాల. సందీప్, 3.కోడం. గణేష్, 4.పెద్దూరు .మహేష్ లు అక్కడ నుండి పారిపోవడంతో ఫిర్యాదుదారుడైన నెమరి గొమ్ముల సురేష్ రావు ఫిర్యాదు మేరకు సుబేదారి ఎస్ఐ ఎండి గాలిబ్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను పట్టుకొని రిమాండ్ కి తరలించినారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments