


విద్యార్థులు లక్ష్యసాధనకు శ్రమించాలి..
మంచి ఫలితాలు సాధించాలి..
ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి..
గురుకులంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు..
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..
పెద్దాపూర్ గురుకులంలో
కలెక్టర్ బస..
విద్యార్థులతో కలిసి భోజనం వసతుల కల్పన పై ఆరా..
సమస్యలుంటే నిర్భయంగా చెప్పాలని సూచన..
విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యసాధనకు కటోరంగ శ్రమించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనీ, తద్వారా పెద్ద ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బాస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
విద్యార్థులు బోధించిన పాఠాలను కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. విద్యార్థుల పనితీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు. దీంతోపాటు నిద్రించే సమయంలో విద్యార్థులతోనూ మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల స్టడీ అవర్స్ ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకొని వారి సామర్థ్యాన్ని వ్పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పర్యవేక్షించారు. స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. గురుకులంలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని శుచి, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వంటకు నాణ్యమైన సరుకులను వాడాలని, పిల్లల భోజనం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు.