Tuesday, December 10, 2024
HomeUncategorized*విద్యుత్ శాఖ సిబ్బంది  పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయండి* - సీఎండీ శ్రీ...

*విద్యుత్ శాఖ సిబ్బంది  పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయండి* – సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి.

సెప్టెంబర్ 06- సమయం న్యూస్
సీఎండీ కార్యాలయంలో అవినీతి  ఫిర్యాదులు స్వీకరించుటకు ప్రత్యేక ఏర్పాట్లు  చేసినట్లు  ముషారఫ్ అన్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 – 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి, ఐ.ఏ.ఎస్ తమ విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి గాను, పలు   అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది. కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థ కు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపధ్యం లో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు. 

ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి వున్నది. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని  సీఎండీ శ్రీ ముషారఫ్ ఫరూఖి పేర్కొన్నారు.

Previous article
*హన్మకొండ*

సమయం న్యూస్ :సెప్టెంబర్06;-

*కాలుష్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పిలుపినిచ్చారు……*


వినాయక చవితి సందర్బంగా మెడిహిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జుబేదాస్ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలోలో హన్మకొండ కనకదుర్గ కాలనిలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎంపీ గారు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే విధంగా జుబేదాస్ హోమ్ కేర్ హెల్త్ సర్వీస్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినదనీయమని అన్నారు.

అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ మట్టిలో నుంచే సకల ప్రాణులు ఉద్భావించాయని  చెపుతుంటారని అన్నారు. అసలు వినాయకుడు పుట్టింది పార్వతి దేవి నలుగు మట్టి నుంచే కదా అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చేయాలని, మట్టి వినాయకులనే  పూజించాలని సూచించారు. మట్టి వినాయకుని పూజించడం అంటే మన ప్రకృతిని పూజించడంతో సమానమని మనకు జీవాన్ని, జీవితాన్ని మనుగడని ఇస్తున్న ప్రకృతిని పూజించే అవకాశం మనకు వినాయక చవితి ద్వారా లభిస్తుందని అలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకుడిని పూజించాలని కోరారు. వినాయక చవితి పండగ అంటేనే ప్రకృతితో ముడిపడి ఉంటుందని అన్నారు. వినాయక చవితి పండుగను ప్రతీ ఒక్కరూ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు.
Next article
*ఆత్మహత్యలు వద్దు.. కలిసి పోరాటం చేద్దాం..*

*రాష్ట్ర రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు*

*సెప్టెంబర్ 06:- (సమయం న్యూస్) రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని గాంధీలో సందర్శించిన హరీష్ రావు*
రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్ కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.
పంట పండించే రైతన్న ప్రాణంకోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. 
రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి.
బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తం.
ముఖ్యమంత్రి గారూ.. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.
దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యండి. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెలకావొస్తున్నది.  ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments