*విద్యుత్ ఘాతంతో మూగజీవాలు మృతి…….*
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారి గూడెం గ్రామంలో గురువారం 11 కేవీ విద్యుత్ వైరు తెగి రహదారిపై పడి,గ్రామానికి చెందిన రాజుల.నరసయ్య మనువడు నగినబోయిన.వెంకటేష్( 25) గొర్రెలను మేతకు తీసుకొని వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి పది జీవాలు( ఒక గొర్రెపోతు 9 గొర్రెలు) మృత్యువాత పడ్డాయి.అందులో నాలుగు గోర్లు సూడి గొర్లు. సుమారు
150000 రూపాయల విలువైన జీవాలు అకాలముగా మృతి చెందడంతో రైతు లబోదిబోమంటున్నాడు. విద్యుత్ ఘాతానికి గురి అయిన మనవడు వెంకటేష్ ను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.